👉 ప్రారంభించిన గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న “ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ట్రైబల్ హీలర్స్ ఆన్ స్టెంతని హెల్త్ ఔట్రీచ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ” శిక్షణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ శివారులోని చేగురూ గ్రామంలో గల కన్హ శాంతి వనంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గదాస్ ఊకే తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈకార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ పాల్గొన్నారు.

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న సంప్రదాయ ఆరోగ్య హీలర్లు, వైద్య నిపుణులు ఈ శిక్షణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గిరిజనుల సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని ఆధునిక ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేస్తూ, సమగ్ర ఆరోగ్య సేవలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
