గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి !

👉 దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ !

J.SURENDER KUMAR,

2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ..

తెలంగాణలో 2027 లో జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి గోదావరి ప్రవహించే జిల్లాల్లో పుష్కరాలకు సంబందించిన ఏర్పాట్లలో భాగంగా పుష్కర ప్రదేశాలను  Tier – 1, Tier 2 మరియు Tier – 3 లుగా విభజించి వాటికనుగుణంగా వ్యూహత్మక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

చేపట్టబోయే పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.  గోదావరి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈవీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, EEPR, EER&B, EERWS, ధర్మపురి ఆలయ ఈవో, సంకటాల శ్రీనివాస్ కలెక్టరేట్ ఏవో హకీమ్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.