21న ధర్మపురికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 21 ధర్మపురి పట్టణంలో పర్యటించనున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన  కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…

పర్యటనలో భాగంగా  ₹ 200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం, గోదావరి నది కలుషితం కాకుండా ₹17 కోట్లు రూపాయలతో  సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

TFID ద్వారా ₹15 కోట్ల ద్వారా ధర్మపురి పట్టణంలో అనేక పనులు చేశాం, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్ల మార్పు, కొత్త స్తంభాల ఏర్పాట్లకు ₹4 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అదేవిధంగా ధర్మపురి పట్టణంలోని అన్ని కుల సంఘ భవనాల నిర్మాణానికి ₹ 2 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ధర్మపురి ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సీఎం పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు.