👉 ఉప్పు వార్త కథనానికి స్పందన !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయానికి జగిత్యాల స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు..
👉 ధర్మం తప్పిన ధర్మపురి మున్సిపల్ ఓటర్ల జాబితా ! శీర్షికన ఉప్పు ప్రచురించిన వార్త కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించి ముసాయిదా ఓటర్ జాబితా పరిశీలన తీరును అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

ఈసందర్భంగా మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ప్రతి వార్డు సర్వే చేపట్టి ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఉంటే తొలగించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఒక వార్డ్ ఓటర్లు మరో వార్డులో వారి పేర్లు ప్రచురితమైతే నివేదిక ఇవ్వండి వివరాలను కలెక్టర్ కు వివరిస్తానని సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు.

ఈసందర్భంలో ముసాయిదా ఓటర్ జాబితాలో అవకతవకలు, మార్పులు, చేర్పులు, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం తదితర అంశాలతో ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.
