👉 పది మందికి పైగా మావోయిస్టులు, హతం ?
J.SURENDER KUMAR,
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఉదయం నుంచి భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది.
అనేక మంది మావోయిస్టులు హతం అయినట్టు సమాచారం., మృతుల సంఖ్యపై అధికారిక తెలియాల్సి ఉంది.
కొల్హాన్ డివిజన్ డిఐజి అనురంజన్ కిస్పోట్టా ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు, ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సీనియర్ పోలీసు మరియు భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సారండా అడవిలో ఉదయం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని, మావోయిస్టులు భారీ నష్టాన్ని చవిచూశారని జార్ఖండ్ పోలీసు ప్రతినిధి మరియు ఐజీ (ఆపరేషన్స్) మైఖేల్‌రాజ్ ఎస్ తెలిపారు.
చోటానగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంబ్దిహ్ గ్రామం సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
50 లక్షల రూపాయల బహుమతి ఉన్న అగ్ర మావోయిస్టు, అతని సహచరులు చాలా మంది మరణించారని భద్రత దళాలు చెబుతున్నాయి, అయితే అధికారిక ధ్రువీకరించాల్సి ఉంది.
ఎన్‌కౌంటర్ స్థలం నుండి అనేక మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, వాటితో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా స్వాధీన పరుచుకున్నట్టు తెలిసింది అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
