👉 మేడారంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రుల బృందం !
J SURENDER KUMAR,
ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గిరిజన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చిన మౌలిక వసతి సదుపాయాలు సర్వసిద్ధంగా ఉన్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ గురువారం మేడారం జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ఈసందర్భంగా మంత్రులు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు, ఎండోమెంట్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తి చేస్తామని, పది కోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రులు స్పష్టం చేశారు.

ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ, వారి సంప్రదాయ పద్ధతుల ప్రకారమే అన్ని పనులు చేపడుతున్నామని, ఆదివాసీ పూజారుల సూచనల మేరకే ఆలయ పునర్నిర్మాణం కొనసాగుతోందని మంత్రులు వివరించారు.
