👉 20 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 13వేల మంది పోలీసులతో బందోబస్తు !
👉 గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను సందర్శించే కోట్లాదిమంది భక్తుల సౌకర్యాల కల్పన కోసం 42 వేల మంది సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం విధులు కేటాయించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. భారీ సంఖ్యలో భక్తజనం హాజరైనప్పటికీ దర్శనం సజావుగా మరియు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
జాతర ఉత్సవాల నిర్వహణలో 21 ప్రభుత్వ విభాగాలు మరియు దాదాపు 42,000 మంది సిబ్బంది పాల్గొంటారు. భక్తుల రాక, మరియు నిష్క్రమణ, ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు, భద్రత, పరిశుభ్రత మరియు వైద్య సౌకర్యాలు కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రభుత్వం ‘మహా జాతర’ ప్రాంతాన్ని 8 జోన్లుగా మరియు 42 సెక్టార్లుగా విభజించింది. ఈ ఉత్సవానికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (RTC) 4,000 బస్సులను మోహరించాలని ప్రణాళిక వేసింది. ఈ మెగా ఈవెంట్ కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు మరియు 108 అంబులెన్స్ లతో పాటు 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
వాహనాల పార్కింగ్ కోసం 1,462 ఎకరాల స్థలంలో 42 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 20 మంది ఐపీఎస్ అధికారులు, 13 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, గజా ఈతగాళ్లు, సీసీ కెమెరాలు డ్రోన్ లో, హై ఫ్రీక్వెన్సీ వాకి టాకీలతో ట్రాఫిక్ నియంత్రణ ,శాంతిభద్రతల పర్యవేక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ తో పర్యవేక్షణ , జాతరలో పిల్లలు తప్పిపోకుండా వారికి ట్యాగులు వేస్తూ అధికార యంత్రం రెప్పవాల్చకుండా భక్తజనంకు సేవలందిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
