జర్నలిస్టుల పాత్ర కీలకం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ధర్మపురి ప్రెస్ క్లబ్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో….

J.SURENDER KUMAR,

జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా సేవలు అమూల్యమని అన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ధర్మపురి ప్రెస్ క్లబ్, టీయూడబ్ల్యూ జె (IJU) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం రాత్రి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ,

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, చీపిరి శెట్టి రాజేష్, ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధు, మహదేవ
, చిలుముల రాజేందర్ , బొంగరాల రాజేష్ , జిల్లా ఈసీ మెంబెర్ పవిత్ర,  సంపత్, బాకి చందు. ప్రవీణ్, క్యాదాసు స్వామి , వెంకన్న, సతీష్, వినయ్, తిరుపతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.