👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
J.SURENDER KUMAR,
20 సంవత్సరాలుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నీ వీడలేదు.. జెండా విడవలేదు, అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసి మంత్రి స్థాయికి ఎదిగాను కష్టసుఖాల్లో నాతో పాలుపంచుకున్న కార్యకర్తలే నా బలం, బలహీనత అంటూ ధర్మపురి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ముళ్ళు భట్టి విక్రమార్క సహకారంతో ₹ 265 కోట్ల నిధులను ఒకేసారి సాధించానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గర్వంగా అన్నారు
ధర్మపురి పట్టణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టి ,వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ₹265 కోట్ల అభివృద్ధి పనులకు కళాశాల మైదానంలో శంకుస్థాపన చేశారు.
👉ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ధర్మపురి గడ్డ మీద, మేమే రాజులం, మేమే మంత్రుల మని చెప్పుకునేవారు, ఇప్పుడేం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
👉 కాస్త ఆలస్యమైన చెప్పిన పనులన్నింటికి నిధులు విడుదల చేయించుకున్నామని గర్వంగా చెప్పారు.డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశా ల, ఇప్పటికే మంజూరు చేయించుకున్నామన్నారు.
.👉 ప్రస్తుతం ధర్మపురికి వచ్చే భక్తులకు మురుగు బాధ తప్పించేందుకు ₹ 24 కోట్లతో సీవరేజ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ₹200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ డ్రైనేజీ పనులు కరెంట్ లైన్ ల పునర్నిర్మాణం, అదనపు, కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లకు నిధులు విడుదల చేసుకున్నామని అన్నారు.
👉 మహిళలను కోటి మందిని కోటీశ్వరులు చేయడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తూ ముందుకు సాగుతుంద న్నారు. వ్యవసాయ యాంత్రికీ కరణలో భాగంగా పరికరాలు పనిముట్లు అందజేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని గుర్తు చేశారు.

👉 ఒడి నా గెలిచిన ఒకే పార్టీ ఒకే జెండాను నమ్ముకొని మీ ముందుకు వచ్చాం . కాంగ్రెస్ పార్టీలో చిన్న పెద్ద తేడా లేదు కష్టపడే వారికి కచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది అన్న దానికి నేనే నిదర్శనం అని చెప్పుకొచ్చారు.
👉.ధర్మపురి బస్ డిపో, రెవెన్యూ డివిజన్, విద్యుత్ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని, దొంతాపూర్ బుగ్గారం, పాత గూడూర్ లేదా సూరారం లో కొత్తగా సింగిల్ విండో సొసైటీలను ఏర్పాటు చేయాలని, మరో ₹ 6.4 కోట్ల నిధులను నిధుల విడుదల చేస్తే కరెంటు సమస్యలన్నీ తీరిపోతాయని డిప్యూటీ సీఎంకు మంత్రి ఆడ్లూరి విజ్ఞప్తి చేశారు .
👉 బిజెపి గంగా హారతులు చేపట్టడం మాత్రమే గాని గంగలో కలిసే మురుగునీరును ఎప్పుడు పట్టించుకోలేదనీ విమర్శించారు.చివరకు మురుగునీరు శుద్ధి చేసే సీవరేజి ప్లాంట్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని గర్వంగా చెప్పారు.
👉 కరెంట్ కొరత లేకుండా చూడాలని సభకు విచ్చేసిన సీఎం డి వరుణ్ రెడ్డి కి సూచించారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలు, అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చాను. అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు..
👉 వ్యవసాయానికి కరీంనగర్ గుండె కాయ
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

వ్యవసాయానికి కరీంనగర్ జిల్లా గుండె కాయ లాంటిదని, రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని లాభాలను అందించే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
వ్యవసాయాన్ని పండగ చేయటానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆయిల్ ఫాం పంట సాగు ద్వార రైతులు అధిక లాభాలు పొంద వచ్చన్నారు.
సాంప్ర దాయ పంటలైన వరి పత్తి పంటల పై ఆధార పడి రైతులు నష్టపోవద్దన్నారు. ధాన్యం సాగులో ఇప్పటికే మనం చైనాను మించిపోయామన్నారు.
బాసర నుండి భద్రా చలం వరకు వచ్చే పుష్కరాలకు గోదావరి వెంట ఉన్న టెంపుల్ ప్రదేశాలను అభివృద్ధి చేస్తాము. ఈ పుణ్య భూమిలో పుష్కరాలను నిర్వహించేంతవరకు నిర్వహించడానికి భారీగా నిధులు విడుదల చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఈ సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విజయ రమణ రావు, మక్కన్ సింగ్ ఠాగూర్ కలెక్టర్ సత్యప్రసాద్,
