👉 మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యం ప్రత్యేక చొరవతో !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ₹ కోటి 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ బి సత్యప్రసాద్ శుక్రవారం కొండగట్టులో పంపిణీ చేశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో నవంబర్ 29 అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంబంధించి 26 ప్లాస్టిక్ బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. బాధితులను మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి , అధికార యంత్రాంగం పరామర్శించి ఓదార్చారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పరిస్థితి వివరించి ప్రభుత్వ పరంగా మీకు ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తానని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు అమలు చేశారు !

అగ్ని ప్రమాదంలో లక్షలాది రూపాయలు సామాగ్రి కోల్పోయి బాధితులను నవంబర్ 30న కొండగట్టులో మంత్రి పరామర్శించి సాధ్యమైనంత వేరకు ప్రభుత్వపరంగా మీకు ఆర్థిక సహాయం చేయడానికి, మీ వ్యాపారాల తిరిగి నిర్వహణకు పెట్టుబడి ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తానని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు.

డిసెంబర్ 2న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి బాధితుల దుస్థితి ఆర్థిక స్థితిగతులను నష్టం తీరుతునులను వివరించి ఆదుకోవాలని వారు సీఎంను కోరారు.
సీఎం సహాయ నిధి నుంచి ₹ 83,12,000 రూపాయలు విద్యుత్ సంస్థ నుంచి ₹ 29 లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా మరో ₹10 లక్షల కలిపి మొత్తాన్ని బాధితులకు మంత్రి ,ఎమ్మెల్యే అందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కలెక్టర్, అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు
👉 టెంపుల్ సిటీ కారిడార్‌గా…
అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికిఈ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
