క్రీడలు నాయకత్వ లక్షణాలకు పాఠశాలలు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, నాయకత్వ లక్షణాలకు పాఠశాలలు అని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం స్వర్గీయ  జువ్వాడి రత్నాకరరావు  జ్ఞాపకార్థంగా మొదలైన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్  కుమార్ , జిల్లా ఎస్పీ అశోక్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, డీసీసీ అధ్యక్షులు నందయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి లతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ వంటి పోటీలు గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఎంతో దోహదపడతాయని మంత్రి అన్నారు.  స్వర్గీయ   జువ్వాడి రత్నాకరరావు  జ్ఞాపకార్థంగా ఈ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యున్నత స్థాయిలో ఉండాలని నిరంతరం సాధన తోనే విద్యా, క్రీడలలో యువత అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు

.