👉 15 జంటలకు ₹ 37 లక్షలు !
👉 మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR
కులాంతర వివాహం చేసుకుని సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్న జంటలకు అభినందనలు తెలియజేస్తూ అన్యోన్యంగా జీవించాలని తెలిపారు. మీరందరూ ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు .
శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు, ఒక్కో జంటకు ₹ 2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను మొత్తంగా ₹ 37,50,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించారు.
👉 దీంతోపాటు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మంత్రి పసుపు కుంకుమ తో చీరను కానుకగా చీరలు అందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ప్రజా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ సెంటర్లు మరియు దివ్యాంగుల కోసం దివ్యాంగుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
👉 అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించిన ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
👉 దివ్యాంగులకు ₹1 కోటి 14 లక్షల విలువగల పరికరాల పంపిణీ !

దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని 9 విభాగాలకు సంబంధించిన 135 మంది దివ్యాంగులకు ₹1,14,77,200 రూపాయల విలువగల ఉపకరణాలు పంపిణీ చేశామని, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రభుత్వం అందించిన ఉపకరణాలు పొందిన దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తూ , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బి. నరేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజకుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
