👉 కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తున్నది అంటూ
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, 938 స్వయం సహాయక మహిళా సంఘాలకు ₹ 2,98,40,444 కోట్ల రూపాయల జంబో చెక్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి పంపిణీ చేశారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన వడ్డీ లేని ఋణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది అన్నారు.
👉 తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య,వైద్యం మరియు మహిళాభివృద్ధికి ఇస్తుంది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుంది అనే మంత్రి అన్నారు.
👉 ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సోలార్ పవర్ ప్లాంట్ లు, పెట్రోల్ బంక్, మహిళలకు వడ్డీ లేని ఋణాలు, అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తున్నదన్నారు.

👉 మహిళలకు కు నైపుణ్య శిక్షణ, సమావేశ నిర్వహణ కోసం,₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరలో పూర్తికాబోతున్నదని తెలుపారు. మహిళలను ఆర్థికంగా స్వావలంబన చేయడం మరియు పేదరికాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది అన్నారు.
👉 ఈ పథకం ప్రధానంగా స్వయం సహాయక సంఘాల ద్వారా అమలులో ఉంది. ఈ పథకం ముఖ్య లక్ష్యం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న వ్యాపారాలు మరియు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం. వడ్డీ లేని రుణాల వల్ల మహిళలు అప్పుల భారమేకుండా తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించగలుగుతున్నారు అని మంత్రి అన్నారు.
👉 ఈ రుణాలను కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమ, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, హస్తకళలు, కుటీర పరిశ్రమలు వంటి పనుల కోసం వినియోగిస్తారు. దీనివల్ల మహిళల ఆదాయం పెరిగి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.

👉 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ గుణాలు అభివృద్ధి చెందుతాయి మరియు సమాజంలో మహిళల స్థానం బలపడుతుంది. ఈ విధంగా ఈ పథకం మహిళా సాధికారతకు మరియు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోంది అన్నారు.
మహిళలకు శిక్షణ మరియు సమావేశాల నిర్వహణ కోసం ₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ లు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, ఏ.వో మెప్మా శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అద్యక్షురాలు, జిల్లా సమాఖ్య సభ్యులు, వివిధ పట్టణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, సభ్యులు, మెప్మా సిబ్బంది, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
