J SURENDER KUMAR,
మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆషామాషి నాయకుడు కాదు, చిన్న కార్యకర్త నుండి మంత్రి స్థాయికి ఎదిగిన తన బాధ్యతను మరువని వ్యక్తి, లక్ష్మణ్ కుమార్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ధర్మపురి లో జరిగిన బహిరంగ సభలో అన్నారు.
👉 2023 ఎన్నికల్లో గెలిచిన వెంటనే లక్ష్మణ్ కుమార్, తన వద్దకు వచ్చి తను నమ్ముకున్న ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మా ముందు వీటన్నిటిని ఉంచారు అని డిప్యూటీ సీఎం అన్నారు.
👉 సీఎం రేవంత్ రెడ్డికి, నాకు ఆయన ఆలోచనలు చూసి ముచ్చటేసింది. మంచి వ్యక్తి కి మంత్రి పదవి ఇచ్చామని మేము సంతృప్తి పడ్డామన్నారు. దీంతో ధర్మపురి నియోజకవర్గానికి ₹ 265 కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశామని బట్టి ప్రకటించారు. ఏ నియోజక వర్గానికి కూడా ఈ స్థాయిలో ఒకేసారి నిధులను విడుదల చేయలేదని స్పష్టం చేశారు.
👉 పాద యాత్రలో పేదలు పడుతున్న కష్టాలను చూసి ఆరు గ్యా రంటీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. బిడ్డ గొడ్డు ఏడ ఉంటదని చెప్పి డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది.
👉 ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసింది .కట్టుకున్న వారికి ఐదు లక్షల ఇస్తుంది . కట్టుకున్న రీతిలో వారం వారం బిల్లులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టిందని గర్వంగా చెప్పుకున్నారు.
👉 ఇందిరమ్మ ఇండ్లతో రాష్ట్రంలో పేదవాడి ఆత్మగౌరవం నిలబడిందన్నారు.ప్రజలతో తమ కు ఉన్న బంధం బాధ్యత ఇదే అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఖర్చుకు వెనుకాడకుండా ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని గుర్తు చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా ₹ 26700 కోట్లు రుణాలను మహిళలకు ఇచ్చామ న్నారు.

👉 పాలన అంటే అందిన కాడికి అందరూ దోచుకోవడం కాదు సంపద పోగేసి ప్రజలకు పంచట మని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలని అనుకున్నాము.
👉 రైతు భరోసా, రుణమాఫీ సబ్సిడీలు, బోనస్ , యాంత్రీకరణ రూపంలో రైతులకోసం ₹1లక్ష కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పారు. చేనేత సంక్షేమ విద్యుత్ విద్య వైద్య రంగాలకు అధికంగా నిధులు కేటాయి స్తున్నాము.
👉 అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎవరెన్ని విమర్శలు చేసిన వెనక్కి తగ్గే పనేలేదని, పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసిన విధంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో సైతం ఆశీర్వ దించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని బట్టి చివరగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
