మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు – ఎమ్మెల్యే సంజయ్!

J.SURENDER KUMAR,

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కార్యాలయం లో కలిసి ధన్యవాదాలు తెలిపారు..

జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది అని మినీ స్టేడియం మంజూరు అయిందని మంజరైన విద్య సంస్థలు, స్టేడియానికి స్థలం ఇంకా గుర్తించలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రి  దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి  తో,  ముఖ్య మంత్రి కార్యాలయం తో ఫోన్ లో మాట్లాడి చల్గల్ లో వాలంతరి భూమిలో  ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, స్టేడియం   ఏర్పాటు చేయడానికి త్వరగా స్థలం గుర్తించాలని మంత్రి  కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో 230 పడకల ఆసుపత్రి ₹ 204 కోట్ల తో మంజూరు కాగా టెండర్ ప్రక్రియ పూర్తి అయి అగ్రిమెంట్ కూడా అయిందని, క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులు పూర్తి అయ్యాయని వాటి భూమిపూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావలసిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సంప్రదించారని ఎమ్మెల్యే వివరించారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్, త్వరితగతిన స్పందించి చొరవ తీసుకున్న  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే  ధన్యవాదాలు తెలిపారు.