J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో బుధవారం మంత్రుల పర్యటన నేపథ్యంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాక సందర్భంగా ఎలిఫర్డ్ సభ వేదిక, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల ఏర్పాట్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పరిశీలించారు కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్, రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మంత్రి వెంట ఉన్నారు.
👉 టీ కొట్టు నిర్వాకుడిని పోరామర్శించిన మంత్రి !

ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం సమీపంలో టి కొట్టు నిర్వాహకుడు కైలాస్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
కైలాష్ కుమార్తె గత కొన్ని రోజుల క్రితం స్వస్థలం రాజస్థాన్ లో అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టి కొట్టు వద్దకు వెళ్లి కైలాష్ ను పరామర్శించి ఓదార్చారు.
