👉 చిట్ చాట్ @ అసెంబ్లీ లో…!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
మామ సభలో మాట్లాడు కోట్లాడు అని చెప్పి పంపిస్తే, అల్లుడు హరీష్ రావు సభ నుంచి బయటకు వెళ్లిపోయాడు అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు..
అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇలా మాట్లాడారు..
👉 సభను బహిష్కరించి వెళ్లే అంశమే సభలో జరగలేదు….
👉 ఉపాధి హామీ పథకంపై చర్చ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందన్న భయంతోనే సభకు రావడం లేదు…
.👉 నీళ్లపై చర్చ అని చెప్పగానే సభ నుంచి పారిపోయారు…..
👉 సభలో చర్చలో పాల్గొనకుండా, బయట ఎంత మాట్లాడిన, చెప్పినా అది వృథానే…..
👉 గత రెండు సంవత్సరాలుగా వారి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు….
👉 తమ పంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు…..
👉 బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్‌ఎస్ నేతలకు లేదు…..
👉 “మా తప్పు ఉంటే అసెంబ్లీలో నిరూపించండి” అని సవాల్ విసిరారు….
👉 మూసీ అంశంలో మీరే రన్నింగ్ కామెంటరీ చేసిన విషయం అందరికీ తెలుసు…..
👉 బీఆర్‌ఎస్ పార్టీ ఖతమయ్యే దశకు చేరుకుంది .. ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే మిగిలింది….
👉 నరేగా పథకంపై మాట్లాడలేక, బీజేపీపై విమర్శలు చేయలేక సభను వదిలి వెళ్లారు…..
👉 పేదల పథకాలపై మాట్లాడే ఆసక్తి వారికి లేదు….
👉 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీటి సౌకర్యం కోసం సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం….
👉 గతంలో వారు తమ ఎమ్మెల్యేలకు కూడా సభలో కనీస గౌరవం ఇవ్వలేదు..,
👉 ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది….
👉 ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి….
