మేడారం జాతరకు సీఎంను ఆహ్వానించిన మంత్రులు !

👉 మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు  ఆహ్వానం !

J.SURENDER KUMAR,

ఈనెల 28 న ప్రారంభం కానున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని మంత్రులు సోమవారం ఆహ్వానించారు.

మంత్రులు శ్రీమతి కొండా సురేఖ , శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా మేడారం  సమ్మక్క–సారలమ్మ మహాజాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు.

👉 శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు !

ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నా హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు.

అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రులు కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.