మేడారంకు గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాల మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్, శుక్రవారం ప్రత్యేకంగా లోక్ భవన్‌ కు వెళ్లి గవర్నర్ మర్యాదపూర్వకంగా కలసి, ప్రభుత్వ పక్షాన భక్తుల సౌకర్యాల కల్పనకు చేపట్టిన ఏర్పాట్లు, వైద్యం, ట్రాఫిక్, పారిశుద్ధ్య పనులు, బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీటి వసతి సౌకర్యం, అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు, వాలంటరీల నియామకం,  చేపట్టిన తదితర ఏర్పాట్లను  మంత్రి లక్ష్మణ్ కుమార్ గవర్నర్ కు వివరించారు.

మేడారం జాతరకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జాతర ఆహ్వాన పత్రికను మంత్రి లక్ష్మణ్ కుమార్   గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ ను వినయ పూర్వకంగా ఆహ్వానించారు.