👉 ₹ 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన !
👉 క్రిటికల్ కేర్ భవనం ప్రారంభోత్సవం !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల దగ్గర ₹ 235 కోట్లతో 450 పడకల ఆస్పత్రిని నిర్మించుకోబోతున్నామని ₹ 23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్, ₹ 3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించుకున్నాం, అందుబాటులోకి రానున్న అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు. మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్, మెడిసిన్ స్టోర్, 450 పడకల ఆస్పత్రి ఏర్పాటుతో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

₹ 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

జగిత్యాల జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్క జిల్లాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి అన్నారు.
👉 రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్రిటికల్ కేర్,
👉 నూతన ఆస్పత్రి జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
👉 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
👉 క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో డయాలసిస్, అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు, మూడు ఆపరే షన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
👉 జగిత్యాల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వైద్యశాలకు కావాల్సిన పరికరాలు, బడ్జెట్ పరంగా అన్నివిధాలా జిల్లా మంత్రి గా కృషి చేస్తానని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 అన్నిరకాల వసతులు డాక్టర్లకు కావాల్సిన సౌకర్యాలు, ఫ్యాకల్టీ పరంగా, పరికరాల పరంగా, అన్నిరకాల సదుపాయాల గురించి రేపు రానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారు.
👉 జిల్లాలోని ప్రయివేట్ హాస్పిటల్స్ కు ధీటుగా మన జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో అన్నిరకాల వసతులు, పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం వైద్యులకి మాత్రమే ఉన్నదని జిల్లా ప్రాంత ప్రజలకు గొప్ప వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.
👉 జిల్లాలోని పేద ప్రజలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి జగిత్యాల ప్రాంతంలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆక్సిజన్ వెంటిలేటర్ ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
👉 జిల్లా అభివృద్దికి వందల కోట్ల నిధుల మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రులకు జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ లు మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మెడికల్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, డి.ఎం.ఎచ్.వో సుజాత, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, ఆశ వర్కర్లు, మరియు తదితరులు పాల్గొన్నారు.
