మున్సిపల్ ఎన్నికల నామినేషన్ విధివిధానాలు !



J SURENDER KUMAR,

నేటి నుండి ( బుధవారం) ప్రారంభం కానున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన విధి విధానాలు ఇలా ఉన్నాయి !

👉 నామినేషన్ దాఖలు – తప్పనిసరిగా చేయాల్సినవి !

👉  ఎన్నికల అధికారి (Returning Officer) వద్ద నామినేషన్ పత్రం దాఖలు చేయాలి ( ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు మాత్రమే స్వీకరించబడును )

👉 నామినేషన్ ఫారం

👉  డిపాజిట్ (భద్రతా మొత్తం) చెల్లించాలి (ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశించిన మొత్తం) SC/ST/BC  ₹ 2,500/-

ఇతరులకు  ₹ 5,000/-

👉 అభ్యర్థి అర్హత !

అభ్యర్ది పేరు (ఆ కార్పొరేషన్ లోని/ మున్సిపల్ లో ఏదైనా ఒక డివిజన్ / వార్డులో ఓటర్ గా ఉండాలి !

👉 కానీ ప్రపోసర్ మాత్రం అదే డివిజన్ ఓటర్ కావాలి !

ప్రతీ అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి, నామినేషన్ సమయములో రిటర్నింగ్ అధికారికి  (RO కి) ఇవ్వాలి అన్నీ ఎన్నికల ఖర్చులు ఈ ఖాతా ద్వారానే జరగాలి!

👉. వాహనాలు & వ్యక్తులపై పరిమితులు
కార్యాలయం చుట్టూ 100 మీటర్లలో 2 వాహనాలు మాత్రమే !

👉  అభ్యర్థి సహా 3 మంది మాత్రమే లోపలికి

👉 అఫిడవిట్ తప్పనిసరిగా సమర్పించాలి,

ఇందులో: క్రిమినల్ కేసుల వివరాలు

a ఆస్తులు & అప్పుల వివరాలు

ఆదాయ వనరుల వివరాలు

విద్యార్హత వివరాలు

👉 . ఓటరు గుర్తింపు పత్రం జత చేయాలి (Voter ID/Aadhaar)

👉. రిజర్వ్ డివిజన్ అయితే సంబంధిత ధృవీకరణ పత్రం తప్పనిసరి
SC/ST/BC రిజర్వేషన్ సర్టిఫికెట్

👉 2 (ఇద్దరు) ప్రతిపాదకులు (Proposers) సంతకం తప్పనిసరి (వారు అదే డివిజన్/వార్డ్ ఓటరై ఉండాలి)

👉. నామినేషన్ పత్రం సమర్పించిన తర్వాత రసీదు తీసుకోవాలి !

👉. స్క్రూటినీ (పరిశీలన) రోజున తప్పనిసరిగా హాజరుకావాలి (లేదా అధికార ప్రతినిధిని పంపాలి)

👉. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటే, ఆ తేదీలోపు మాత్రమే ఉపసంహరించుకోవాలి
(Only Mandatory)

👉 నామినేషన్ ఫారం !

👉 డిపాజిట్ !

👉 అఫిడవిట్ !

👉 గుర్తింపు పత్రాలు !

👉 రిజర్వేషన్ సర్టిఫికెట్ (ఉండితే)!

👉 ప్రతిపాదకుడి సంతకం !

👉 స్క్రూటినీకి హాజరు !