J.SURENDER KUMAR,
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన రాకముందే మంత్రి లక్ష్మణ్ కుమార్ అడ్వాన్స్ గా కసరత్తు చేస్తూ కార్యకర్తలను, నాయకులను ఉత్తేజ పరుస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో వార్డులు రిజర్వేషన్ ఖరారైన విషయం తెలిసిందే. రేపు మాపో నోటిఫికేషన్ రానున్నది. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందస్తుగా కార్యకర్తలను నాయకులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో సోమవారం నూతనంగా కొనుగోలు చేసిన ఎన్నికల ప్రచార రథం ను ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలతో పాటు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.. పూజ కార్యక్రమం అనంతరం నాయకులు కార్యకర్తలతో ప్రచార రథంలో మంత్రి పర్యటించారు.

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు.ఐదు మున్సిపాలిటీలో పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంతనాలు ?

రాజకీయ పరిమాణాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంత్రి లక్ష్మణ్ కుమార్ పలుమార్లు మంతనాలు జరపడంతోపాటు, సీఎం కార్యాలయం తో పాటు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను జగిత్యాల జిల్లాలో కార్యకర్తల సమావేశానికి ఆహ్వానించడం. ధర్మపురి లో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతొ పర్యటనలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో ప్రణాళిక ప్రకారం మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్టు చర్చ.
