మున్సిపల్ ఎన్నికల పై  కలెక్టర్ లతో కమిషనర్ సమీక్ష !

👉 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని !

👉 జగిత్యాల కలెక్టరేట్ నుండి  కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో


J.SURENDER KUMAR,


మ్యాపింగ్, ఓటర్ లిస్ట్ మరియు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్ లు (లోకల్ బాడీస్), ఆర్డివో లు మరియు మున్సిపల్ కమిషనర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్షించారు.

👉 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధిత పట్టణ స్థానిక సంస్థలలో వార్డు వారీగా మరియు పోలింగ్ స్టేషన్ వారీగా ఎన్నికల ఓటరు జాబితాల తయారీపై సూచనలు అందించారు.


👉 ఖచ్చితమైన ఓటరు జాబితాల తయారీ ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
నిర్దేశించిన మార్గదర్శకాలు మరియు కాలపట్టికలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.


👉 అర్హత గల కొత్త ఓటర్ల చేర్పుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డూప్లికేట్ మరియు అనర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై చర్చించి తగిన సూచనలు అందించారు.


👉 ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల యంత్రాంగం మరియు మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయాన్ని సమీక్షించారు.

👉 పోలింగ్ స్టేషన్‌లకు సంబంధించి తాజా ఓటరు డేటాను వినియోగించాలని సూచించారు. అవసరమైన చోట్ల పోలింగ్ స్టేషన్‌ల పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలిపారు.

👉 ఓటరు జాబితాల తయారీ సమయంలో ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని వివరించారు. ఓటర్లలో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని చట్టబద్ధ ఫారములు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


👉 జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ విధానాలపై చర్చించారు. ఓటరు జాబితాల తయారీలో ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.

👉 స్వేచ్ఛాయుత మరియు న్యాయమైన ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని కమిషన్ పునరుద్ఘాటించింది. అన్ని ముందస్తు చర్యలను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

👉 సవరించిన ఓటర్ల జాబితా ప్రచురణ.!

12.01.2026 సమయానుసారం సవరించబడిన తెలంగాణ పురపాలక చట్టం-2019లోని సెక్షన్ 195-ఎ ప్రకారం వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ.

👉 13.01.2026 పోలింగ్ కేంద్రాల జాబితా యొక్క ముసాయిదా ప్రచురణ మరియు దానిని Te-Pollలో అప్‌లోడ్ చేయడం.

👉 16.01.2026 కలెక్టర్ల కార్యాలయాలు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు మరియు తహశీల్దార్ కార్యాలయాలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా మరియు పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ అని ప్రకటించారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ !

జిల్లాలో 5 మున్సిపాలిటీలో 229 అభ్యంతరాలు రాగా సంబంధిత అధికారులు వాటికి బదులు తెలిపాలని అన్నారు. వచ్చిన ప్రతి అభ్యంతరానికి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. అలాగే నామినేషన్ కేంద్రాలు మరియు పోలింగ్  కేంద్రాలు ఏర్పాట్లలో తగు జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో పోలింగ్ సిబ్బంది మరియు ఆర్వో ల నియామకం, శిక్షణ అందించడం డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ ల వద్ద మౌళిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలు, ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

జిల్లా నోడల్ అధికారులు మరియు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వహించాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్ జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి, జెడ్పి డిప్యుటీ సిఈవో పి. నరేష్, డిపివో మదన్ మోహన్, జిల్లా నోడల్ అధికారులు, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ కమిషనర్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.