J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో పెగడపల్లి, గొల్లపల్లి బుగ్గారం, మండలాలలో అనారోగ్య తదితర కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు..
👉 పెగడపల్లి మండలం లో..

నంచర్ల గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ తల్లి మల్లవ్వ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని సభ్యులను మంత్రి పరామర్శించారు.

పెగడపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపి.గండ్ర వెంకట్రావు తండ్రి ముత్యంరావు అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.
👉 గొల్లపల్లి మండలంలో..

గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లలా రామ్ మోహన్ రెడ్డి తల్లి శ్రీమతి సరోజన ఇటీవల. మృతి చెందింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి స్వర్గీయ సరోజన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..
👉 బుగ్గారం మండలంలో..

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్ , తండ్రి బాదినేని రాజమల్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి స్వర్గీయ రాజమల్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..
