👉 ధర్మపురి మున్సిపాల్ ఎన్నికల ప్రచారంలో….
👉 మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందని మీరు ఇచ్చిన ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సేవ చేయడంతో పాటు నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటునాని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మున్సిపాలిటిలోని 15వ వార్డు లో శనివారం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ….
గతంలో ధర్మపురి ప్రజలు అధికారం ఇచ్చిన నాయకులు ఒక్క రోజు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలు మరిచిపోయి విలాసవంతమైన జీవితం గడిపారని మంత్రి అన్నారు. తాను ఎన్నికల్లో గెలిచిన ఓటమి చెందిన ప్రజల మధ్యనే ఉన్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో నాలుగు హామీలు అమలు చేస్తున్నాం..మరో రెండు హామీలు నేరవేర్చుతాం.. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు అని మంత్రి లక్ష్మన్ కుమార్ అన్నారు.
👉 హమీలు మరచిన కేసీఆర్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ఎన్నికల ప్రచారానికి ధర్మపురి వచ్చిన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హమీ ఇచ్చి ఒక్కటి నేరవేర్చాలేదని మంత్రి అన్నారు.
రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటిల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటిలు అమలు చేస్తుందని రానున్న రోజుల్లో మిగిలిన రెండు హమీలు నేరవేర్చుతామని మంత్రి అన్నారు. రెండు హమీలు నేరవేర్చిన తరువాతనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ధర్మపురిలో రెండేళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలు !

ధర్మపురి పట్టణంలో గడిచిన సంవత్సరాలుగా అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చూట్టామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా 695 మంది కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 154 మంది ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేయడంతో పాటు ఇప్పటి వరకు ₹ 7 కోట్ల 70 లక్షలు చెల్లించామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 327 మందికి ₹ 93 కోట్ల 75వేలు అందజేశామని మంత్రి తెలిపారు.
కళ్యాణ లక్ష్మి పథకం ద్వార 206 పేదలకు ₹ 2 కోట్ల 6లక్షల 23వేలు అందజేశామని అలాగే గృహ జ్యోతి పథకం ద్వార 2,783 మంది లబ్దిదారులకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేస్తున్నమని తెలిపారు. పట్టణంలో 542మంది రైతులకు ₹ 4 కోట్ల 2లక్షల 58 వేల రుణ మాఫీ చేశామని అన్నారు. 15 కుల సంఘాలకు ₹ 1 85 లక్షలతో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. టీఎఫ్ఐడీసీ మరియు రూరల్ డెవలఫ్మెంట్, స్పెషల్ డెవలఫ్మెంట్ ఫండ్ మరియు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 అభివృద్ది కోసం కాంగ్రెస్ కు మద్దతు..

15 వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన వడ్లూరి సునిల్ తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో ప్రకటించారు.
ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన మంత్రి సునిల్ ను మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. మసీద్ రాజేష్ తో పాటు మరి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
