👉 జనవరి 9న తిరుగు ప్రయాణం !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం కేరళలోని శబరిమలై పుణ్యక్షేత్రానికి వెళ్ళనున్నారు. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం త్రివేండ్రం కు వెళ్ళనున్నారు.

కేరళ ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారి మంత్రి లక్ష్మణ్ కుమార్ ను త్రివేండ్రం విమానాశ్రయంలో స్వాగతించి , ఆ రాష్ట్ర ప్రభుత్వ కాన్వాయ్ తో శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయం వరకు ప్రోటోకాల్ పద్ధతిలో మంత్రిని తీసుకువెళ్లనున్నారు.
👉 ఇరుముడి కట్టుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శబరి యాత్ర వెళ్లడానికి సోమవారం రాత్రి ఇరుముడి కట్టుకున్నారు.

కరీంనగర్ పట్టణంలోనీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో గురుస్వామితో ఇరుముడి కట్టించుకొని శబరిమల యాత్రకు బయలుదేరారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒకే ఒక్కడు !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని 16 మంది క్యాబినెట్ మంత్రివర్గంలో ఈసారి అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించి దీక్షలో కొనసాగుతున్న ఒకే ఒక్కడు మంత్రి లక్ష్మణ్ కుమార్.. కావడం ప్రస్తావనరం.
