నూతన సంవత్సరంలో ప్రజలు సుఖంగా ఉండాలి !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


నూతన సంవత్సరంలో  రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలు, బడుగు బలహీన వర్గాలకు మరింత ఉపయోగపడేలా కృషి చేస్తాం. అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నూతన సంవత్సర సందర్భంగా గురువారం  మంత్రి లక్ష్మణ్ కుమార్  పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి స్వామి  వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయంలో మంత్రి  కోడె మొక్కు చెల్లించుకున్నారు

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కి వేద ఆశీర్వచనం అందించారు, అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి,శాలువాతో సన్మానించారు.