పదవులు శాశ్వతం కాదు ప్రజాభిమానమే శాశ్వతం !

👉 బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల సమావేశంలో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

అర్ధాంతరంగా వచ్చిపోయే రాజకీయ పదవులు పదోన్నతులు, హంగు ఆర్భాటాలు, ప్రోటోకాల్ స్వాగతాలు, సాయుధ అంగరక్షకులు, కాన్వాయ్ హోదాలు శాశ్వతం కాదని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం సమాజంలో చిరస్మరణీయమని  ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ధర్మపురి లోని మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ నుంచి తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు స్వచ్ఛందంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, కార్యకర్తలను ఉద్దేశించి  మాట్లాడుతూ..

నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ జెండాను పట్టుకొని దశాబ్దాలుగా కొనసాగుతున్న నాకు జెడ్పిటిసి సభ్యుడిగా,జిల్లా పరిషత్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా క్యాబినెట్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని మంత్రి అన్నారు.

👉 2009 నుంచి నేను ఎమ్మెల్యేగా ఓడిన గెలిచిన కష్టకాలంలో నా వెంట నడిచిన నాయకులను కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని కాంగ్రెస్ పార్టీలో  చేరిన వారితో పాటు  పార్టీలోని సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేస్తూ, ప్రతి కార్యకర్త గౌరవాన్ని కాపాడుతాను. అని మంత్రి అన్నారు.

👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ధర్మపురి నియోజకవర్గ  ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం  రాష్ట్ర మంత్రి కావడం నా పూర్వజన్మ సుకృతమని, ధర్మపురి నియోజకవర్గ ప్రజల రుణాన్ని జన్మజన్మలకు తీర్చుకోలేనని మంత్రి అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయాదాక్షిన్యాలు ఉంటేనే ఇక్కడ ప్రజాప్రతినిధిగా గెలవడం సాధ్యమని. ఆయన అనుగ్రహం లేకుంటే ప్రజలు ఆదరించాలని, నన్నుఆదరించిన ప్రజల అవసరాలు తీర్చే గురుతర  బాధ్యత నాపై ఉందని మంత్రి అన్నారు.

👉 ప్రతి కార్యకర్త గౌరవాన్ని కాపాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొచ్చే విధంగా పలు చారిత్రక నిర్ణయాలు తీసుకున్నదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ,రైతులకు రైతు భరోసా సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన వంటి పథకాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయని పేర్కొన్నారు.అలాగే రాజీవ్ యువ వికాసం, చేయూత, ఆసరా పెన్షన్ల పునరుద్ధరణ, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్, దళిత, గృహ లక్ష్మి పథకం, అన్నపూర్ణ పథకం ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని  మంత్రి అన్నారు.

👉 విద్య, ఉపాధి రంగాల్లో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, రెండు సంవత్సరాల లో 59 వేల మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా నిర్వహించిందని అన్నారు.

👉 ధర్మపురి లో లక్ష్మీ నరసింహ సంస్కృత–ఆంధ్ర కళాశాల పునఃప్రారంభం, ఎల్లంపల్లి ముంపు బాధితులకు మిగిలిన ₹18 కోట్ల పరిహారం పంపిణీ, ధర్మపురిలో మంజూరైన డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు,ధర్మపురి గోదావరి సివరేజ్ పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు.

👉 ఈనెల 20న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క  ధర్మపురి మండలానికి రానున్నారని, ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలో స్పష్టమైన అభివృద్ధి, మార్పు ప్రజలకు కనబడేలా పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

👉 2027లో జరగనున్న ధర్మపురి పుష్కరాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 కాంగ్రెస్ గూటికి చేరిన.. కారు పార్టీ నాయకులు వీరే !

ధర్మపురి మున్సిపాలిటీ తాజా మాజీ  వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, తాజామాజీ కౌన్సిలర్లు అయ్యోరి వేణుగోపాల్,  సయ్యద్ యూనస్, తాజా మాజీ కౌన్సిలర్ శ్రీమతి పురాణపు కిరణ్ మై భర్త సాంబమూర్తి,  ధర్మపురి పట్టణ సీనియర్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ వార్డు సభ్యుడు స్తంభంకాడి రమేష్ తో, పాటు పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.