👉 మహిళలు మా ప్రభుత్వ ఆడపడుచులు !
J . SURENDER KUMAR,
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇంటి నెంబర్ రాని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా త్వరలోనే ఇంటి నెంబర్ పత్రాలు అందజేస్తామని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరలు మరియు ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నెంబర్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
మహిళల మా ప్రభుత్వ ఆడపడుచులు వారి ఆర్థిక భద్రతతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళా స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, పేదలకు సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో బాధ్యతతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇంటి నెంబర్ రాని వారు ఇంకా ఉంటే వారికి కూడా త్వరలోనే పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు.
