రాజ్యాంగం పరిరక్షణ అందరి బాధ్యత మంత్రి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

బ్రిటిష్ వారి కబంధహస్తాల నుంచి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను  ప్రతి పౌరుడు నిత్యం స్మరించుకుంటూ , రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలోని  మంత్రి క్యాంపు కార్యాలయంలో  సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

👉 చేతి గుర్తు పార్టీలో చేరిన కారు పార్టీ నాయకుడు !

ధర్మపురి పట్టణానికి చెందిన బిఆర్ఎస్  సీనియర్ నాయకులు చుక్క భీమరాజ్, సంధ్యారాణి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా భీమరాజు పోటీ చేసి కేవలం 10 ఓట్ల లోపు ఓటమి చెందారు.

కాంగ్రెస్ కార్యకర్తలతో కరీంనగర్ కు వెళ్లి   మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.