సమ్మక్క గద్దెల అభివృద్ధికి ₹ 10 లక్షలు కేటాయిస్తా !

👉 మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి  మండలం రాజారాం పల్లి లోని సమ్మక్క సారలమ్మ గద్దెల జాతర ప్రాంగణంలో ఏర్పాట్ల కోసం ప్రభుత్వ పక్షాన ₹ 10 లక్షల నిధులు కేటాయిస్తానని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రాజారాం పాలే లోని సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని తులాభారంతో అమ్మవారికి బంగారం ( బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ ను జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. రాజారాంపల్లి అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు ప్రజలకు హామీ ఇచ్చారు.

👉 నర్సింగాపూర్ లో…..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ( ధర్మపురి నియోజకవర్గం)  నర్సింగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క–సారలమ్మలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి జాతర కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.  గద్దెల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.