J.SURENDER KUMAR,
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ (సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 మాజీ సీఎం రోశయ్య సతీమణి మృతి బాధాకరం !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిరాడంబర జీవితం గడిపిన శివలక్ష్మి , రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి నిలిచారని ఆయన గుర్తుచేసుకున్నారు. శివలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపం తెలియజేశారు.
👉 అక్షర యోధుడికి నివాళులర్పించిన సీఎం !

ప్రజా కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి/వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అక్షరయోధుడికి నివాళులర్పించారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా నిర్భయంగా వ్యక్తపరిచిన అలిశెట్టి ప్రభాకర్ గారు సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడారని ఆయన స్మరించుకున్నారు.
కవిగా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్‌గా బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన అలిశెట్టి అన్యాయం, అసమానతలపై నిరంతరం పోరాడుతూ ప్రజాసాహిత్యానికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని ముఖ్యమంత్రి కొనియాడారు.
👉 సంక్రాంత్రి సంబరాలకు ఆహ్వానం !

సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , శాసనసభ్యులు దానం నాగేందర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు.
👉 బాసర క్షేత్రానికి సీఎంకు ఆహ్వానం !

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరగబోయే వసంత పంచమి (శ్రీ పంచమి) ఉత్సవాలు – 2026 లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ , బాసర దేవస్థానం ఈవో, అర్చకులు ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21 నుండి 23 వ తేదీ వరకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం వారు శ్రీ పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
👉 జోగులాంబ ఆలయానికి ఆహ్వానం !

ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ , ఆలయ ఈవో, అర్చక బృందం ముఖ్యమంత్రి ని కలిసి ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందించారు.
👉 సీఎంను కలిసిన జార్ఖండ్ మంత్రి !

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ మర్యాదపూర్వకంగా కలిశారు.
👉 హాకీ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం !

అంతర్జాతీయ హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్–2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, అలాగే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 సెలబ్రేట్ ది స్కై’ కార్యక్రమానికి ఆహ్వానం !

సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సెలబ్రేట్ ది స్కై’ కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి, ఈ నెల 13 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమం గురించి వివరించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో గాలిపటాలు, హాట్ ఎయిర్ బెలూన్స్, డ్రోన్ల ప్రదర్శన వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించి, వాటిలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు.
