సమ్మక్కను దర్శించుకున్న కేంద్ర మంత్రులు !

👉 స్వాగతం పలికిన మంత్రులు లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క!

J.SURENDER KUMAR,

గిరిజనుల మహా కుంభమేళా పండుగ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను కేంద్ర మంత్రులు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి  సమ్మక్క సారల మన దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి రాష్ట్ర మంత్రులు  ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, స్వాగతం పలికారు.

👉 డప్పు కొట్టిన మంత్రులు !

గిరిజన డప్పు వాయిద్యాల మధ్య ఆలయంలోకి ప్రవేశించిన కేంద్ర మంత్రులు, గద్దెలపై ‘నిలువెత్తు బంగారం’ సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి  జువల్ ఓరం, రాష్ట్ర మంత్రులు గిరిజన డప్పులను కొట్టారు.

👉 మేడారం జాతరను జాతీయ పండువ గా గుర్తింపు ఇవ్వండి !

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ను జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ , కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, ను కోరారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి పక్షాన మీకు ఈ అభ్యర్థన చేస్తున్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు మీ రాకన్ ప్రభుత్వ పక్షాన స్వాగతిస్తున్నాను అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, మీడియాతో మాట్లాడుతూ…

సమ్మక్క – సారలమ్మ జాతర గిరిజనుల మహా కుంభమేళా అని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, పీఎం జన్‍మన్ పథకం కింద ₹ 24,000 కోట్లు, తెలంగాణకు 23 ఏకలవ్య పాఠశాలలు కేటాయించినట్లు తెలిపారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి  ₹ 80 కోట్లు, రామప్ప ఆలయానికి ₹ 40 కోట్లు, జాతర ఏర్పాట్లకు ఈ ఏడాది ₹ 3.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

మేడారంలో సమ్మక్క – సారలమ్మ పేరుతో ₹ 890 కోట్ల వ్యయంతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ప్రధాని ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.

👉 సమ్మక్కను దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి దంపతులు !

మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో అమ్మవార్లను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు , ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.

ఈసందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మంత్రి సీతక్క  భట్టి విక్రమార్క ,మహేష్ కుమార్ గౌడ్   స్వాగతం పలికారు..