సమ్మక్క–సారలమ్మ జాతర కు సర్వం సిద్ధం !

👉 ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు!

👉 గిరిజన  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!

J.SURENDER KUMAR,

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని గిరిజన  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రకటనలో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

👉 తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ప్రతీకలుగా నిలిచిన ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మలు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలుగా వెలుగొందుతున్నారని పేర్కొన్నారు.

👉 తెలంగాణ చరిత్రలో అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన పోరాట గాథకు సమ్మక్క–సారలమ్మలు ప్రతీకలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే మహోన్నత పర్వదినమే మేడారం జాతర అని ఆయన అన్నారు.

👉 కొంగుబంగారంలా కొలువైన తమ ఇలవేల్పులకు మొక్కులు చెల్లించేందుకు, కోరిన కోరికలు తీర్చాలని ఆకాంక్షిస్తూ దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచికూడా భక్తులు తరలివచ్చే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం మేడారం జాతర అని వివరించారు.

👉 కోట్లాదిగా భక్తులు పాల్గొనే ఈ జాతర కుంభమేళాను తలపించే విధంగా విశాలత, వైభవంతో కొనసాగుతుండటం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని ఆయన ఆకాంక్షించారు.

👉 ఈ మహాజాతర శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సాగాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ సమ్మక్క–సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు.