👉 ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు !
J.SURENDER KUMAR,
వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతర లో మంత్రులు భక్తజనంతో మాట్లాడుతూ ఒకసారి సౌకర్యాలు ఏర్పాట్లను గూర్చి వారిని అడిగి తెలుసుకున్నారు .

ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కారు దిగి బైక్ ఎక్కారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి గురువారం జాతర ప్రాంగణంలో మంత్రులు స్వయంగా ద్విచక్ర వాహనాల నడుపుతూ గల్లీ గల్లీ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రోటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి సాధారణ భక్తుల తరహాలో భక్తజనంతో మాట్లాడారు. జంపన్న వాగు వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.

మంత్రులు టీ కొట్టు వద్ద ఆగారు, చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. టి కొట్టు వ్యక్తితో భక్తులకు “ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? సౌకర్యాలు ఎలా ఉన్నాయి?” భక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ మంత్రులు ఆరా తీశారు. ద్విచక్ర వాహనాలకు మంత్రుల పర్యటన తీరు భక్తుల ప్రశంసలు అందుకుంటున్నది.
