👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఆదివాసీ ఆరాధ్య దైవం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రమైన మేడారంలో నిర్వహించడంపై మంత్రివర్గ సహచరులందరూ సంతోషం వ్యక్తం చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలోగానీ హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సందర్భం లేదు అన్నారు సోమవారం ఉదయం గుడిని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
👉 సమ్మక్క – సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

👉 ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప–లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల – తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
👉 మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం నిర్వహించిన ఈ ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క – సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించే విధంగా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

👉 “గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకుని జరుపుకునే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయి. 2023 ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం.
👉 ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళాను తలపించే విధంగా, ఆదివాసీలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దాం. ఇది ఒక అరుదైన సందర్భం. అద్భుతమైన సన్నివేశం. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పూర్తి చేయాలని చెప్పాను.
👉 మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. జీవితకాలంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తినిచ్చే ఘట్టం ఇది. జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం.
