👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ఎంతగానో ఆదర్శనీయమని ఇప్పటి మహిళ ఉపాధ్యాయులు, ఇతర మహిళ అధికారులు అందరు కూడా సావిత్రిబాయి పూలే తరహాలో
సమాజానికి తమ వంతు సహకారం అందించి సమాజ పురోగతికి పాటుపడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల కలెక్టరేట్ లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి, జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
👉 ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

సావిత్రిబాయి పూలే జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను అభినందించారు.
సావిత్రిబాయి ఫూలే 1831లో మహారాష్ట్రలోని నైగావ్‌లో జన్మించారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి, ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మరియు బాలికల విద్య కోసం అవిశ్రాంత న్యాయవాదిగా మారడానికి సామాజిక అడ్డంకులను అధిగమించింది. .
ఆమె జీవితం వలస భారతదేశంలో మహిళల హక్కులు, దళిత సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం ప్రారంభ పోరాటానికి ప్రతీక అని అన్నారు.
ప్రపంచ దేశాల మన్ననలు పొందిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమారి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ లను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళాభ్యున్నతి కొరకు సాధికారత కొరకు ఎన్నో మహిళా సంక్షేమ పథకాలు అందిస్తున్నందున మహిళలు సద్వినియోగం చేసుకోని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయులు కష్టపడి విద్యా రంగంలో మన జిల్లాను అగ్రగామిగా నిలపాలని మంత్రి కోరారు.
👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…..

సావిత్రిబాయి పూలే 195వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను అభినందించారు.
సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ఎంతగానో ఆదర్శనీయమని ఇప్పుడు ఉన్నటువంటి మహిళ ఉపాధ్యాయులు, ఇతర మహిళ అధికారులు అందరు కూడా ఇదేవిధంగా సమాజానికి తమ వంతు సహకారం అందించి సమాజ పురోగతికి పాటుపడాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం మహిళభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవార్డు పొందిన మహిళ ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. మరింత ఉత్సాహంగా సేవలు అందించాలని ఆకాంక్షిచారు. అనంతరం జిల్లాలోని 20 మంది ఉత్తమ మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత (రెవెన్యూ ) అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్, డిప్యూటీ ట్రైని కలెక్టర్, డి ఈ ఓ రాము మరియు తదితరులు పాల్గొన్నారు
