శబరిమల స్వామిని దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామిని  బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున మంత్రి ఇరుముడితో పవిత్ర మెట్లు దర్శించుకొని,  శ్రీ అయ్యప్ప స్వామికి  సమర్పించుకొని అభిషేక, అష్టదళ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఆలయ ప్రధాన తాంత్రికుడు స్వామి వారి గంధం విభూది, పుష్పాలు, ప్రసాదం అందించి ఆశీర్వదించారు.. సీఎం రేవంత్ రెడ్డి,  ప్రజా పాలన ప్రభుత్వంలో  రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు మంత్రి అన్నారు.

మంగళవారం సాయంత్రం పంపానదికి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కన్నెమూల  మహాగణపతిని దర్శించుకుని,   ఎనిమిది కిలోమీటర్ల దూరానగల శబరిమలై ఆలయానికి కాలినడకన చేరుకున్నారు.

కేరళ ప్రభుత్వం మంత్రి కి త్రివేండ్రం విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం వరకు  ప్రోటోకాల్ భద్రత చర్యలు చేపట్టారు.
సీఎం అధ్యక్షతన గురువారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశ నేపథ్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తన పర్యటన షెడ్యూల్ కు ఓ రోజు ముందుగానే  బుధవారం రాత్రి హైదరాబాద్ కు  తిరుగు ప్రయాణమయ్యారు.