👉 శేషప్ప శతక చంద్రిక పుస్తకావిష్కరణ సభలో..
👉 డాక్టర్ సంగనపట్ల నరసయ్య !
J.SURENDER KUMAR,
మహాకవి శేషప్ప గూర్చి ఎన్ని రోజులైనా చెప్పగల సాహిత్యం ఆయన రచనలలో ఉంది. ఆయన రచనలతో ముడిపడి ఉన్న ధర్మపురి క్షేత్ర మహత్యం చరిత్ర గూర్చి ఎన్ని రోజులైనా చర్చించవచ్చు శేషప్ప శతకం సమాజం మనుగడకు మార్గదర్శకం చేస్తున్నదని ప్రముఖ సాహిత్య వేత్త, చరిత్రకారుడు, డాక్టర్ సంగనభట్ల నరసయ్య అన్నారు.

ధర్మపురి క్షేత్రంలోని బ్రాహ్మణ సంఘ భవనంలో సోమవారం పీ.వీ.సాహిత్య పీఠం-కరీంనగర్ & శేషప్ప సాహిత్య మిత్రమండలి ధర్మపురి నిర్వహణలో శ్రీమతి చంద్రలేఖ వైద్య ( గుండి) రచించిన శేషప్ప శతక చంద్రిక పుస్తకావిష్కరణ ను ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఆవిష్కరించారు.

ఈసందర్భంగా సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ నరసయ్య తన ఉపన్యాసంలో శత చంద్రిక పుస్తకం గూర్చి, శేషప్ప చరిత్ర, ధర్మపురి క్షేత్ర మహత్యం, తదితర అంశాలను తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ కస్తూరి, గౌరవ అతిథి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, విశిష్ట అతిథులు కల్వకోట వెంకట సంతోష్ బాబు, ఆత్మీయ అతిథులు కోరిడే శంకర్, డాక్టర్ ఆచార్య పి వారిజారాణి, గుండి విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

