తెలంగాణలో అమెరికాకు చెందిన సంస్థ పెట్టబడులు !

👉 దావోస్‌ సదస్సులో ఒప్పందం !

J.SURENDER KUMAR,

అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ కేంద్రం – (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ – MRO) నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా ₹1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సర్గాడ్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.


👉 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్‌లో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ  శ్రీనివాస్ తోట  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.

👉 ఏరోస్పేస్, రక్షణ, ఆటోమొబైల్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో సర్గాడ్ సంస్థకు విశేష అనుభవం ఉంది.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సేవల రంగానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), తయారీ రంగానికి పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), వ్యవసాయం, గ్రీన్ ఎకానమీకి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (RARE)లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

👉 వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి  సర్గాడ్ సీఈఓ కి సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.

👉 ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  మాట్లాడుతూ, ఈ పెట్టుబడులతో తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలకు పరికరాల తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.