విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి !

👉 అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ !


J.SURENDER KUMAR,

విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందించాలని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ అన్నారు. ధర్మపురి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)  బి. రాజ గౌడ్,  ఎంపీడిఓ తో కలిసి శుక్రవారం మధ్యాహ్న విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిమాణం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వంటశాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వ విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రిన్సిపాల్ ఆదేశించారు.

పాఠశాలలో మౌలిక సదుపాయాలపై సమీక్షించారు తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు, విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో పాఠశాలలో అందిస్తున్న విద్యా బోధనపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలో ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని విద్యార్ధినులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.