👉 స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం నిర్వాహకుడు డా. గణేశ్ గొల్లపెల్లి !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెయ్యనూరి సువిష్ణ రాణి ( IIIT బాసర) లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదువుతున్న విద్యార్థినికి ఆరు సంవత్సరాల కాలేజీ ఫీజులను స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం చెల్లించనున్నదని నిర్వాహకుడు డా. గణేశ్ గొల్లపెల్లి తెలిపారు.
మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి ఇటీవల మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని విద్యార్థిని దుస్థితిని తుంగూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం కన్వీనర్ డా. గొల్లపల్లి గణేశ్ దృష్టికి తెచ్చారు.
ఆవిద్యార్థినికి స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా దత్తత తీసుకోగా అమెరికాలో ఉంటున్న ధర్మపురికి చెందిన ఎన్నారై విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చులు సంవత్సరానికి ₹15 వేల చొప్పున (6 సంవత్సరాలు) చెల్లించడానికి ముందుకు వచ్చారు.
మొదటి సంవత్సరం ఖర్చులు ₹15 వేలు శుక్రవారం విద్యార్థినికి మండల విద్యాధికారి నాగభూషణం మరియు తుంగురు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి ద్వారా అందించారు.
దాతలకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్ నిర్వాహకుడు డా. గొల్లపెల్లి గణేశ్, తుంగూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
