ఎన్నికల్లో బిజెపి జండా ఎగరాలి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు !

👉 బిజెపిలో చేరిన  ధర్మపురి బీఆర్ఎస్ మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ !

J SURENDER KUMAR,

భారతీయ జనతా పార్టీ  అభివృద్ధికి కృషి చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగిరివేయాలని  బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు,

హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో   అధ్యక్షులు రామచంద్ర రావు ఆధ్వర్యంలో ధర్మపురి మండలం  తాజా & మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తినీ అరుణ, తోపాటు కొత్తకొండ రాజు, నక్క నగేష్ , బత్తిని ఇంద్రకరణ్, బత్తిని వీణ , బోయినపల్లి గంగారాం , గొల్లపెల్లి రాజేష్  రేణిగుంట శ్రీకాంత్ , గట్ల అనిల్  , హర్షవర్ధన్ తదితరులకు బీజేపీ కండువా కప్పి  పార్టీలోకి స్వాగతించారు.
బిజెపి రాష్ట్ర నాయకులు దామెర రామ సుధాకర్ రావు  ఆధ్వర్యంలో ఈ చేరికల ప్రక్రియ జరిగింది.

ఈ కార్యక్రమంలో ధర్మపురి పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్, మండల అధ్యక్షులు, కమలాపుర్  గ్రామ సర్పంచ్ కుమ్మరి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు నల్లవెల్లి సుజన్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ , కందాల మూర్తి, తదితరులు పాల్గొన్నారు