నాటకాన్ని చూసి మైమరిచిపోయాను షణ్ముఖ శర్మ!

👉 గయోపాఖ్యానం నాటకాన్ని తిలకించిన
ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ !

J SURENDER KUMAR,

నేను చాలా వరకు నాటకాలను చూడను, కానీ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి నటులు కళాకారులు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకాన్ని చూసి నేను మైమర్చిపోయానని ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.

ధర్మపురి క్షేత్రంలో గత వారం రోజులుగా  ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ చే కొనసాగుతున్న శ్రీమద్భాగవత కథా మహాయజ్ఞం సప్తాహం ప్రవచన కార్యక్రమంలోలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నాట్యమండలి వారు   ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకాన్ని శర్మ తిలకించారు.

ఈసందర్భంగా  షణ్ముఖ శర్మ మాట్లాడుతూ సనాతన సాంప్రదాయ సంస్కృతిని కాపాడుతూ నటన కౌశల్యం హావభావం రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు, అద్భుతం అని ప్రశంసించారు. ప్రత్యేకంగా సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న నాట్యమండలి కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.