👉 ధర్మపురి ప్రజలకు నాయకులుగా కాదు.. సేవకులుగా పనిచేయాలి !
👉 ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ సమావేశంలో !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డుపెట్టుకొని ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని మున్సిపల్ పాలకవర్గంలో ఎన్నికైన వారు నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గానికి సూచించారు.
ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…...

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు 15 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ధర్మపురి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి అన్నారు.
👉 2009 నుంచి తనకు దినేష్ అండగా నిలిచారని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో మంచి చెడులకు తానే బాధ్యత వహిస్తానని మంత్రి తెలిపారు. తప్పకుండా అందరికి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
👉 కౌన్సిల్ సభ్యులు సూచించిన సమస్యలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం చూపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
👉 ధర్మపురి పట్టణంలో ని ప్రతి ఇంటికి తాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. పుష్కరాలకు వస్తున్న నేపథ్యంలో ధర్మపురి కి నిధులు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు.

👉 కనివిని ఎరుగని రీతిలో ధర్మపురిని అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నేను ఇక్కడే ఓట నమోదు చేసుకుని త్వరలోనే ధర్మపురి లో నివాసం ఏర్పాటు చేసుకుంటానని మంత్రి తెలిపారు.
👉 ఈ నెల 27న పుష్కరాల ఏర్పాట్లపై ధర్మపురికి ప్రభుత్వం తరఫున కన్సల్టెన్సీ ప్రతినిధులు వస్తున్నారని మంత్రి తెలిపారు. పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి పుష్కరాల ఏర్పాట్లకు సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.
👉 మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ…..
ప్రజలు 15మందికి 15మందిని గెలిపించానికి కృషి చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు.
👉 మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న మాట్లాడుతూ …
మంత్రి లక్ష్మణ్ కుమార్ చోరవతో పుష్కరాలను విజయవంతం చేస్తామని అన్నారు.
👉 జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ…..

నూతన పాలకవర్గం అభివృద్ధి, సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్య పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య తదితరులు పాల్గొన్నారు.
