అధికార కౌన్సిలర్ల గెలుపే ధర్మపురి అభివృద్ధికి పిల్లర్ !

👉 4, 6 ,7, 8 9, 12 , 13 వార్డుల ప్రచారం లో..

👉  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  !

J.SURENDER KUMAR ,

ధర్మపురి పట్టణంలో అద్భుతమైన అభివృద్ధికి, ఆశించిన స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, విద్య, వైద్యం, పచ్చదనం పరిశుభ్రత, తదితర అభివృద్ధికి ఆయా వార్డులలో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల గెలుపే అభివృద్ధికి వారు పిల్లర్ లు అవుతారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగం  శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణ కేంద్రంలోని 8 వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

👉 9 వ వార్డులో మంత్రి ప్రచారం !

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  పట్టణ కేంద్రంలోని 9 వ వార్డు కోరండ్లపల్లెలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వీరవేణి నాగలక్ష్మి, కొమురయ్య కు మద్దతుగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను మంత్రి కోరారు.

👉 6, 7 వార్డులలో  ఇందిరమ్మ కాలనీలో మంత్రి ప్రచారం !

పట్టణంలోని, 6, ,7 కమలాపూర్ రోడ్డు లోని గిరిజన, ఇందిరమ్మ కాలనీలలో మంత్రి ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో జనం తరలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

10ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన లో అర్హులైన పేద ప్రజలకు ఒకరికి రేషన్ కార్డు ఇవ్వలేదని  మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డు అందజేశామని మంత్రి  తెలిపారు.

200 యూనిట్ల లోపు  విద్యుత్తు వినియోగించిన వారికి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనేక అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ధర్మపురి మున్సిపల్ లో 15 మందిని గెలిపిస్తే రానున్న మూడు మూడేళ్లలో ధర్మపురి పట్టణాన్ని ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆసక్తి ఉన్న వారికి సంక్షేమ శాఖ ద్వార రుణాల అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు..

👉 4,వ 12 వ, 13 వ వార్డులలో విస్తృత ప్రచారం !

పట్టణ కేంద్రంలోని 4 వ, 12 వ, 13 వ వార్డుల ప్రజలతో  చింతామణి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు చిపిరిశెట్టి రాజేశ్, చుక్క సంధ్య భీమరాజ్, కొమురెల్లి పవన్ లకు  మంత్రి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.


రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు.


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రచారంలో జన ప్రభంజనం !

శుక్రవారం మార్నింగ్ వాక్ తో మంత్రి లక్ష్మణ్ కుమార్  తెనుగు వాడ, కోరండ్ల పల్లె, గుండయ్యపల్లె,  హరిజనవాడ, కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ, తంబళ్లకుంట, కా శెట్టి వాడ, హనుమాన్ వాడ,లలో కౌన్సిలర్ అభ్యర్థులను వెంటపెట్టుకొని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.

ఎన్నికల ప్రచార రథం తో పాటు,  ద్విచక్ర వాహనంపై కాలినడకన మంత్రి ప్రచారంలో జన ప్రభంజనం అగుపించింది.