అధికారంతో అరాచకాలు చేయలేదు మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడానికి అదే కారణం !

👉 శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆశీస్సులు ధర్మపురి ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ ప్రజా పాలనతోనే ఈ ఫలితాలు !

👉 మీడియాతో చిట్ చాట్ లో…!

J SURENDER KUMAR,

నేను అధికారం అడ్డుపెట్టుకొని అరాచకాలు చేయలేదు, అందరికీ అందుబాటులో ఉన్నాను, శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆశీస్సులు ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతోనే ధర్మపురిలో మా పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..

మున్సిపల్ ఎన్నికలలో ధర్మపురి 15 కౌన్సిలర్ స్థానాలకు 15 క్లీన్ స్వీప్  చేసిన సందర్భంలో ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్  చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

అధికారం ఉందని వీర్ర వీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలు కొందరు అధికారం ఉందని అహంకారంతో వ్యవరిస్తే ధర్మపురి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని మంత్రి అన్నారు.

👉 తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ధర్మపురిలోనే అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తు ధర్మపురి అభివృద్దికి కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు.

👉 అధికారంలో లేని సమయంలో అనేక కష్టాలకు, కన్నీళ్లతో పాటు అవమానాలకు గురి అయ్యానని, ఓపికతో పని చేస్తు ముందుకు సాగితే విజయం సాధ్యమైయిందని మంత్రి అన్నారు. 

👉 ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి  వరకు ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని మంత్రి అన్నారు. అధికారం ఉందని వీర్ర వీగలేదని మంత్రి తెలిపారు.

👉 గతంలో అధికారంలో  ఉన్న నాయకులు ఏలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో గుర్తు చేశారు.

👉 మున్సిపాల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్టంలో తీసుకు వచ్చిన రెండేళ్ల ప్రజాపాలనను చూసి ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.

👉 ప్రజలు ఇచ్చిన తీర్పుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి అన్నారు. రానున్న మూడేళ్లలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి కష్టాలతో పాటు సాగునీటి కష్టాలు తీర్చుతానని మంత్రి హమీ ఇచ్చారు.

👉 ధర్మపురిలో బస్సు డిపోతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు పాలిటెక్నిక్, రెవెన్యూ డివిజన్ కేంద్రం వంటి అనేక వసలు కల్పించడానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు.

👉 ధర్మపురి విజయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి రానున్న పుష్కరాలకు ధర్మపురికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తానని మంత్రి అన్నారు.


👉 తనను కలిసేందుకు వచ్చే వారు ఎవ్వరు మధ్య వర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని నేరుగా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చి కలువవచ్చని ప్రజలను కోరారు.