అధికారం అడ్డుపెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు !


👉 ధర్మపురి పట్టణ అభివృద్ధే మా ప్రధాన  అజెండా !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ ఒక్కరిని   ఇబ్బంది పెట్టిన చరిత్ర నాకు లేదని, గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ  పాలనలో మాత్రం ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా గొప్పదని అంబేద్కర్ వారసులుగా ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏనాటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది నిజం కాదా ? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.

👉 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వెల్గటూరు, ధర్మపురి మండలాల్లో ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణిచివేశారో అందరికీ తెలుసని మంత్రి  విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో  ఉన్న సమయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలపై అనేక మందిపై అక్రమ కేసులు నమోదు చేయించిన చరిత్ర కొప్పుల ఈశ్వర్ ది  అని మంత్రి అన్నారు.

భారత దేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు కనీసం సోషల్ మీడియాలోనై భావ వ్యక్తికరణ చేసే పరిస్థితి లేదని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 ముఖ్యమంత్రి ముందు మాట్లాడని వ్యక్తి కొప్పుల..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ధర్మపురి పట్టణ ప్రజల సమస్యలపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు మాట్లాడి నిధులు తీసుకువచ్చే దమ్ములేని వ్యక్తి అని మంత్రి అన్నారు.

యాదాద్రిని అభివృద్ది చేసినప్పటి ధర్మపురిని కేసీఆర్ పట్టించుకొని సమయంలో ఎందుకు ముఖ్యమంత్రిని నిధుల కోసం ప్రశ్నించలేదని మంత్రి అన్నారు.  తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ముఖ్యమంత్రితో మాట్లాడి ధర్మపురిలోని నైట్ కాలేజీ తిరిగి ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు.

నైట్ కాలేజీతో పాటు అనేక అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి నిధులు సాధించానని మంత్రి అడ్లూరి అన్నారు. ధర్మపురి అభివృద్ధి విషయంలో సీఎం తనకు పూర్తి మద్దతు ఇచ్చారని, “ఏమి కావాలన్నా నేను ఉన్నాను” అని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు

👉 మున్సిపాల్ ఎన్నికల తరువాత సిరిసిల్ల వస్తా..

ముఖ్యమంత్రిపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ చేసిన వాఖ్యాలపై  మంత్రి లక్ష్మణ్ కుమార్ మండి పడ్డారు. ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇలాంటి వాఖ్యాలు చేయడం సరియైనది కాదని మంత్రి అన్నారు. తాము  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  ఏనాడు మాట్లాడలేదని మంత్రి అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో భార్య భర్తల ఫోన్ విన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై మాట్లాడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.  మున్సిపాల్ ఎన్నికల ఫలితాల తరువాత సిరిసిల్లకు వస్తానని మంత్రి అడ్లూరి అన్నారు


తాను మాట తప్పనని గతంలో సిద్దిపేట వస్తానని వచ్చానని ఇప్పుడు తప్పకుండ సిరిసిల్ల కు వస్తానని మంత్రి తెలిపారు.  వ్యక్తిగత విమర్శలకు తాను దిగదలుచుకోలేదని, నిజాలు చెప్పడం మొదలుపెడితే ఎదురుపక్షానికి ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించారు.

👉 పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు !

గత పదేళ్లలో పాలన చేసినవారు ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా ? అని ప్రశ్నించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 700 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, జీవన భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే  డిగ్రీ కళాశాల, ఐటీఐ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గోదావరి నుంచి కలుషిత నీరు నేరుగా ప్రవహించకుండా ₹24 కోట్లతో శుద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశామని, త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఐటీఐ, రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

👉 విద్యుత్, గృహాలు, రుణమాఫీ – అన్నింటిలోనూ కాంగ్రెస్ ముద్ర !

200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 2,783 కుటుంబాలకు ₹ 8 లక్షల మేర బిల్లు మాఫీ చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ₹7 కోట్ల వ్యయంతో అనేక కుటుంబాలకు గృహాలు అందించామని వెల్లడించారు. రుణమాఫీ కింద 542 కుటుంబాలకు ₹4 కోట్ల ప్రయోజనం కల్పించామని పేర్కొన్నారు. TFID ద్వారా ఆరు మున్సిపాలిటీల్లో ₹15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్నూరు, దళిత, పద్మశాలి వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు.

👉 కాళేశ్వరం పేరుతో ఖజానా దోపిడీ !

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. రాష్ర్టం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ర్ట ఆర్ధిక ప్రగతిని గాడిలో పెట్టి ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీలను రానున్న రోజుల్లో అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

👉 మౌలిక సదుపాయాలు – మా లక్ష్యం !.

రోడ్లు, బైపాస్ రోడ్డు, ఎస్సీ–బీసీ స్టడీ సర్కిళ్లు, దివ్యాంగుల హాస్టల్, కళాశాలలు— ఇవన్నీ ప్రజల అవసరాల కోసమే చేస్తున్నామని చెప్పారు. “నేను ప్రజల రుణం తీర్చుకుంటాను” అని స్పష్టం చేశారు. గత పదేళ్లలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కనీసం 25 శాతం పని కూడా జరగలేదని విమర్శించారు. 2027లో గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు భారీ నిధులు తీసుకొస్తామని, ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రముగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

👉 సాగునీరు కోసం సీఎం వరకు వెళ్లా !

ఆరేపల్లి నుంచి రాజారాం వరకు పంటలు ఎండిపోతున్న పరిస్థితిని చూసి సీఎం ను ఇరిగేషన్ మంత్రిని బ్రతిమలాడి సాగునీరు అందించామని తెలిపారు. దొరగారైన కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ తమ నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారని, కానీ ధర్మపురిని మాత్రం నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. బురద జల్లే రాజకీయాలు చేయడం సరికాదని, లక్ష్మీనరసింహస్వామి అన్నీ చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఎలాంటి లాభం ఆశించకుండా ప్రజల కోసం పనిచేశానన్నారు.

👉 చేతి గుర్తుకు ఓటు వేయండి..!

ధర్మపురి మున్సిపాలిటీలోని 15 వార్డుల అక్కచెల్లెళ్లందరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సేవ చేసే కౌన్సిలర్లు కావాలంటే కాంగ్రెస్‌కే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో ధర్మపురి సంపూర్తి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ధర్మపురి మున్సిపాలిటిని అప్పగించాలని ఓటర్లకు మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.