ఆలయ అభివృద్ధికి నిధులు మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 దోనూరు నూతన ఆలయ ప్రహరి గోడ నిర్మాణం కు ₹ 5 లక్షల నిధులు మంజూరు !

👉 ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR,

నూతనంగా నిర్మితమైన ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కోరిన విధంగా ఆలయ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తానని, ప్రస్తుతం ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి ₹ 5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కమిటీ సభ్యులకు తెలిపారు.


ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదివారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూర్ణకుంభతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వామివారి దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రిని ఘనంగా ఆశీర్వదించారు.