👉 మహాశివరాత్రి సందర్భంగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు !
J.SURENDER KUMAR,
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరియు దుర్గ మల్లేశ్వర స్వామి (శివాలయం)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని, శివుడిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు, ఆరతులు నిర్వహించారు.
తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ప్రార్థించారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు, సిరి సంపదలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని భగవంతుడిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఫలప్రదంగా అమలవ్వాలని అమ్మవారిని వేడుకొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందాలని మంత్రి ఆకాంక్షించారు. శివుడి కృపతో రాష్ట్రానికి మరింత అభివృద్ధి, ప్రజలకు మరింత మంచి రోజులు రావాలని ఆయన ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు, పద్మశాలి నాయకులు గూడూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్ గౌడ్ , తోపాటు ధర్మపురి కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .
